విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఏపీ ప్రజల కష్టాలను చూసి షర్మిల ఏపీకి వచ్చారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తానని నాతో చెప్పారు. మీకు కావాల్సింది పాలకులు కాదు. ప్రశ్నించే గొంతుకలు. వైఎస్సార్ చివరి కోరిక రాహుల్ గాందీ ప్రధాని కావడం. విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు. తెలుగు రాష్టాల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే అన్నదమ్ముళ్లలాగా కలిసి పోరాడుతాం. మనమంతా తెలుగు వాళ్లం.. మనమంతా అన్నదమ్ముళ్లం. పదేళ్లు గడుస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన వారసులు ఎలా అవుతారు? ఏపీ బాగుపడాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. మిగతా పార్టీల నాయకులు ఎవరు ప్రశ్నించలేరు. షర్మిలకు ఆ సత్తా ఉంది. ప్రశ్నించి మీ సమస్యలు తీరుస్తుంది. షర్మిలమ్మను నమ్మి చట్ట సభల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి. కాంగ్రెస్‌కు 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి. విశాఖ స్టీల్ ప్లాంటును షర్మిలమ్మ ఇంచు కూడా కదలనివ్వదు. మీరు కాంగ్రెస్ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ముఖ్యమంత్రి అయ్యాక మీ సమస్యలన్నీ తీరుస్తుంది. తెలంగాణ ఉప ఎన్నికల్లో మా పార్టీకి 3,200 ఓట్లు మాత్రమే వచ్చినప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. కానీ ఆ తర్వాత ఢిల్లోనీ మోదీని, తెలంగాణలోని కేడీని ఓడించి అధికారంలోకి వచ్చాం. 5 ఎమ్మెల్యే సీట్ల నుంచి 65 సీట్లు గెలిచాం. ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ ఎక్కడ ఉంది అని అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ఏపీలోనూ కాంగ్రెస్ గెలిచి, షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనిపిస్తుంది’’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa