మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ సెలవులపై ప్రభుత్వం విధించిన నిబంధనలు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళా ఉద్యోగులు తమ 180 సెలవులు ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపింది.
దీంతో తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపు ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.