తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ సోమవారం (మార్చి18) మొదలుకానుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం ఉదయం పది గంటల నుంచి నమోదు చేసుకోవచ్చు. మార్చి 20 వతేదీ ఉదయం పదింటి వరకూ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుంది. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.
అలాగే శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను మార్చి 21వ తేదీ పది గంటలకు విడుదల చేస్తారు. వీటితో పాటు జూన్ 19 నుంచి 21 వరకూ జరిగే జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21వ తేదీ ఉదయం పదింటికి అందుబాటులో ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్రదీపాలంకారసేవల వర్చువల్ కోటా టికెట్లు విడుదల చేస్తారు.
మార్చి 23వ తేదీ ఉదయం పదిగంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, 11 గంటకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తామని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 23 మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నారు. ఇక మార్చి 25న ఉదయం పదింటికి జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు.
మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను.. ఇక అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. మరోవైపు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని టీటీడీ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa