యూపీలోని రాయ్‌బరేలి ప్రాంతంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. బచ్రావానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్లైఓవర్‌పై ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. అతివేగం వల్ల అతడి బైక్ అదుపుతప్పింది.
దీంతో ఆ బైకర్ ఫ్లైఓవర్ రెయిలింగ్‌ను ఢీకొట్టాడు. ప్రమాద ధాటికి ఎగిరి పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు వాహనదారులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa