పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఇన్వెజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి ముగిసేంతవరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఉదయం 9: 30 నుండి మధ్యాహ్నం 12 45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.