రాయదుర్గం నియోజకవర్గంలోని 76 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 4, 539 మంది రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. సోమవారం ఉదయం 9: 30 గంటల నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.