గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వెనుక వ్యక్తి సజీవ దహనమైన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఆటో రవి అనే యాచకుడు మంటల్లో కాలిపోయి మృతి చెందాడు.
రవికి ఎవరూ లేకపోవడంతో భిక్షాటన చేస్తూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో ఉంటున్నాడు. రవికి కాళ్లు చేతులు పనిచేయవు. మస్కిటో కాయిల్స్ నుంచి మంటలు చెలరేగి అతడు సజీవ దహనమయ్యాడు.