మాల్దీవుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను భారత్‌లోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఏప్రిల్ 21న జరిగే ఈ ఎన్నికల కోసం సుమారు 11వేల మంది ఓటర్లు తమ కోసం పోలింగ్ స్టేషన్లు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తిరువనంతపురం(భారత్), కొలంబో(శ్రీలంక), కౌలాలంపూర్(మలేషియా)లో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది.