మాల్దీవుల భద్రత విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గురించి ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు ముయిజ్జు వ్యాఖ్యనించారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళం (MNDF) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘మాల్దీవులు స్వతంత్రత, సార్వభౌమత్వం కలిగిన దేశం. ఇక్కడ భద్రత, నిఘా విషయంలో ఇతరుల జోక్యం అనవసరం. ప్రతి అంశంలోనూ స్వయంసమృద్ధి కలిగిన దేశంగా ఎదగాలనుకుంటోంది’ అని ముయిజ్జు పేర్కొన్నారు.