నరసన్నపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బగ్గు రమణ మూర్తి విజయానికి సమష్టిగా కృషి చేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ నాయులు అన్నారు. ఆదివారం క్యాడర్ తో కలిసి పోలాకి, అంపలాం గ్రామాల్లో పర్యటించారు. గ్రామ స్థులతో మాట్లాడుతూ.. టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు పాటుప డాలన్నారు. కార్యక్రమంలో నేతలు భైరి భాస్కరరావు, మైలపల్లి త్రినాథ్, రమణమూర్తి, రాంబాబు, యందవ హరికృష్ణ, నల్లాన వెంకునాయుడు తదితరులు పాల్గొన్నారు.