కంబదూరు మండలం అండేపల్లిలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మెలో ఉండడంతో తాగునీటి సమస్య మరింత ఉదృతంగా మారిందన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామన్నారు.