సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ...... ఉజ్జాయింపుగా 27వ తేదీ బస్సు యాత్ర మొదలైతే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏప్రిల్ 18కి అటుఇటుగా బస్సు యాత్ర ముగియనుంది. వీలైనంత వరకు సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాలు కవర్ అవుతాయి. నోటిఫికేషన్ వచ్చిన తరువాత నామినేషన్లు మొదలైనప్పటి నుంచి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ రెగ్యులర్‌గా ఎన్నికల సభలకు బయల్దేరుతారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎలాగైతే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో, అలాగే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, అభివృద్ధిలో వారి భాగస్వామ్యం, పారదర్శకతతో సంక్షేమ అందించడం కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు తీసుకురావడానికి, జనం కోసం వైయస్ జగన్ తాపత్రయపడ్డారు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa