మీ ముగ్గురూ కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా..? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్.. ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసు అంటూ మండిపడ్డారు. నాడు విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. ప్రధానిని ఆనాడు చంద్రబాబు ఏమన్నారో ప్రజలకు గుర్తుంది. పొరపాటున ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది?. ముగ్గురు కలిసి పోటీ చేసినా సీఎం వైయస్ జగన్‌ను ఓడించలేరు. చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావంతో బతుకుతున్నారు. ప్రజాగళం సభలో మైక్ మూగబోయింది. మైక్ కూడా సరిచేసుకోని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అంటూ ప్రశ్నించారు.