ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి , ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి (గుంటూరు) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ శాస్త్రికి కండువాలు కప్పి పార్టీలోకి సీఎం వైయస్ జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమా (వైయస్ఆర్సీపీ గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్) పాల్గొన్నారు.