ఏపీలో మే 13న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఎస్ కేఎస్. జవహర్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లుపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కెఎస్. జవహర్ రెడ్డి, డీజీపీ కేవి.రాజేంద్రనాధ్ రెడ్డి, సీఈవో ముకేశ్ కుమార్ మీనాలు సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యునికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో డీజీపీ, సీఈవోతో పాటు వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు హాజరయ్యారు.