ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు.