ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన నాయకులకి తగిన గౌరవం ఇస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 08:40 PM

తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వ‌చ్చిన తర్వాత జ‌న‌సైనికుల‌కి తగిన గౌర‌వం ఇస్తామని మాజీ మంత్రి నారాయణ అన్నారు. గురువారం నాడు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు వేమిరెడ్డి, నారాయణ, బీదా రవిచంద్ర, జనసేన పార్టీ నేత మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారి సిటీ నియోజకవర్గం నుంచి జనసేన కార్యాలయానికి నారాయణ వెళ్లారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. సిటీతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలవబోతున్నామని ఇరుపార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అరాచ‌క పాల‌న‌ని త‌రిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని నారాయణ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa