విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ కంటైనర్‌లో 25 వేల కేజీల డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జర్మనీలోని హాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖపట్నం వచ్చిందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa