సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు. కొండేపి నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు విద్యా వంతులు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు స్ధానిక టీడీపీ నాయకులు వెల్లడించారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.