లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేషనల్ మీడియా కో ఆర్డినేటర్ రోహన్ గుప్తా కాంగ్రెస్కు శుక్రవారం రాజీనామా చేశారు.
ఇప్పటికే అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఆయన పేరును పార్టీ ప్రకటించింది. తన తండ్రి అనారోగ్యం వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇటీవల రోహన్ గుప్తా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.