భర్త పై అనుమానంతో భార్య పెయిన్ కిల్లర్ మందు బిళ్ళలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బాపులపాడు మండలం మల్లవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆమెను శుక్రవారం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన చల్లా కృష్ణవేణి, ఆమె భర్త తరచూ గొడవలు పడుతూ ఉంటారు. తన భర్త ఫోన్ లో మాట్లాడుతుండేవాడు దీనిపై భార్య మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నూజివీడు పోలీసులు తెలిపారు.