మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో శుక్రవారం తాళ్లపల్లి గ్రామానికి చెందిన పలు ఎస్సీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ. దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి ఎస్సీలకు వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.