స్పెయిన్‌లోని కానరీ దీవుల సమూహంలోని లాంజరోట్, ఫ్యూర్టెవెంచురాలను సందర్శించే పర్యాటకులకు అధికారులు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడి ఇసుక, రాళ్లను తీసుకెళ్తున్నారట.
ఇది ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో సందర్శకులకు రూ.2లక్షల వరకు ఫైన్ విధించేస్తున్నారు. పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి ఇటీవల ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.