ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై వైయస్ఆర్సీపీ ప్రత్తిపాడు అభ్యర్థి బాలసాని కిరణ్, ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, ఆయన అనుచరులు దాడికి దిగారని, తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారని బాలసాని కిరణ్ అన్నారు. 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు. నా డ్రైవర్, మా కార్యకర్తలకు గాయాలయ్యాయి. మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు. నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని బాలసాని కిరణ్ మండిపడ్డారు.