ఏలూరు శ్రీరామ్ నగర్‌లో వైయస్ఆర్‌సీపీ నాయకులు దారపు తేజ, గేదెల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పోణంగికి చెందిన 200 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. నరసాపురం మండలం చామకూరిపాలెంలోని అంబేద్కర్ నగర్‌లో వైయస్ఆర్‌సీపీ గ్రామ అధ్యక్షుడు గుంపుల రత్నరాజు ఆధ్వర్యంలో 50 మంది జనసేన, టీడీపీ కార్యకర్తలు పార్టీ నేత పీడీ రాజు సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు.