రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. టీడీపీ కార్యాలయంలో అర్థవీడు మండలం పెద్దకందుకూరు గ్రామ మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు చేగిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ ముత్తుముల అశోక్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.... అందరం కలిసికట్టుగా నియోజ కవర్గంలో టీడీపీని గెలిపించాలని తెలిపారు. పార్టీలో చేరిన వారితో ఆయా గ్రామాల్లో ఉండే సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ఏ గ్రామంలో చూసినా టీడీపీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అదే స్పూర్తితో అందరూ సమష్టిగా కృషి చేసి తనను గెలిపించాలన్నారు. పార్టీలో చేరిన చేగిరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు.