విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తీవ్రంగా ఖండించింది. విశాఖకు డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారంటూ మండిపడ్డారు. శనివారం మూడు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేస్తామంటే అందరూ మోసపోయారని... చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మర్చారంటూ ఏపీ తెలుగు దేశం పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని.. మనం చేసే యుద్ధంలో గెలిచి తీరాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అధికార పార్టీ మన మధ్య పొత్తు చెడగొట్టేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా ఈ పొత్తు అవసరమని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఏదోక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని. చంద్రబాబు ఇచ్చిన స్పూర్తి, పవన్ ఇచ్చిన ధైర్యాన్ని ఆలంబనగా తీసుకుని పనిచేయాలని నాదెండ్ల సూచించారు.