మహిళలను గౌరవించే ఇల్లు, సమాజం సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. మహిళలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిన వ్యక్తి, దార్శనీకుడు చంద్రబాబు అని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కొనియాడారు. మహిళలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు అమలు చేశారని గుర్తుచేశారు. సూపర్ సిక్స్ పథకాలతో పేదింటి మహిళలు సంతోషంగా ఉండాలని చంద్రబాబు సంకల్పించారన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే మహిళలకు రక్షణ, సంక్షేమం లభిస్తుందని పనబాక పేర్కొన్నారు.