విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. విజయవాడ టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని.. దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే.. ఆ కేసులో ఇప్పటిరవకు ఎటువంటి పురోగతి లేదన్నారు. వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. డ్రగ్స్ మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవల్సిన అవసరం ప్రజలపైనే ఉందన్నారు. డ్రగ్స్‌పై సీఎం జగన్ ఒక్కసారైనా సమీక్ష చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.