ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన రాక్షస ప్రభుత్వం రాష్ట్రాన్ని పీక్కుతింటుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించినందుకే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సొంత బాబాయిని చంపేసిన వారి పాలనలో భువనమ్మ ధైర్యంగా బయటకొచ్చి పార్టీ కుటుంబసభ్యులని ఓదారుస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల పట్ల భువనమ్మకి ఉన్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని వెల్లడించారు. మరోవైపు వాకాడు మండలం తిరుమూరు, వెంకటాచలం మండలం పుంజులూరుపాడు, కులిచెర్లపాడులో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర కొనసాగనుంది. అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో తీవ్ర ఆవేదనకి గురై మృతిచెందిన వారి కుటుంబాలని భువనమ్మ పరామర్శిస్తున్నారు. టీడీపీ అండగా ఉంటుందంటూ భరోసా ఇస్తున్నారు.