ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులపై టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ చిన్న స్కాం అని.. ఏపీ లిక్కర్‌లో ఇంతకన్నా పెద్ద స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో లిక్కర్ అమ్మకాలల్లో డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకోవడం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని.. జగన్ జీవితాంతం జైల్లో ఉన్న ఆయనపై ఉన్న కేసులు సరిపోవంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో అన్ని స్కాం లే అని.. సీబీఐ విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డి, వారి మంత్రులు జైల్లో ఉంటారంటూ టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ చేశారు.