విశాఖ గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని బీజేపీ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయన్నారు. విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారన్నారు. గంజాయి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌పై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ డగ్స్ వ్యవహరంపై కులాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి, వారి బంధువులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం బీజేపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.