ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణ భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం గూడూరు ఏ-5 కన్వెన్షన్‌లో నిర్వహించిన మహిళాశక్తి సమావేశంలో భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ చేపట్టారు. ఏ-5 కన్వెన్షన్‌కు శ్రామిక మహిళలు భారీగా చేరుకున్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామిక మహిళలతో భువనేశ్వరి మాటామంతి నిర్వహించారు.