ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక భేటీ నిర్వహించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో ఈ వర్క్ షాప్ నడుస్తోంది. అభ్యర్థులతో పాటుగా నియోజకవర్గాల ఇన్‌చార్జులు కూడా హాజరయ్యారు. జనసేన, బీజేపీ ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల హక్కులు, వైసీపీ కుట్రలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా చర్చించారు. ఎన్నికల్లో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులు, వ్యూహాలను చంద్రబాబు వివరించనున్నారు.