రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి అన్నారు. మార్కాపురం మండలంలోని వేమలకోట గ్రామంలో టీడీపీలోకి పలు కుటుంబాలు మాజీ సర్పంచ్ చాగంటి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చేరాయి. వార్డు మెంబర్లకు కర్రి నర్సిరెడ్డి, గోగు వెంకటేశ్వర్లు, జానపాటి సుబ్బ య్య, సున్నం కోటేసులతో పాటు 100 కుటుం బాల వైసీసీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. మాజీ సర్పంచ్ చాగంటి సుబ్బారెడ్డి, వార్డు సభ్యులతో పాటు పలు కుటుంబాల వారికి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ.. మార్కాపురం ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ఏర్పడాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు. ఈ నమ్మకంతో చేరుతున్నట్లు తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతు న్నామన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజక వర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్, టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున, జవాజి రామానుజలరెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, వేములకోట టీడీపీ నాయకులు జంకె రమణారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.