ఎన్నికల కోడ్ అమలులో వుందని తెలిసి కూడా వలంటీర్లను పిలిచి సమావేశం పెట్టి వాళ్లను ఇరకాటంలో పెట్టింది ఎంపీ భరతేనని జనసేన రాజమహేంద్రవరం ఇన్‌చార్జి అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అనుశ్రీ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులమాటున 25శాతం కమీషన్ తీసుకునే భరత్.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తాడా, రాజమహేంద్రవరంలో డిపాజిట్లు కూడా రావని అన్నా రు. పవన్‌ను అత్యధిక మెజార్టీతో పిఠాపురం ప్రజలు గెలిపించబోతున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మీటింగ్‌లు పెట్టకూడదని తెలిసి కూడా వలంటీర్లతో మీటింగ్ పెట్టి వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేశాడని, పైగా ఆ బురద తమ అభ్యర్థిపై జల్లే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంట్రాక్టరు మార్గాని సురేష్ కనుసన్నల్లో మునిసిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి అన్నిపనులు జరగడం వెనుక భరత్ ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో జనసేన ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ, పైడి రాజు, నల్లంశెట్టి వీరబాబు, శ్యాంసుందర్, విన్నవాసు పాల్గొన్నారు.