పోలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఎట్టకేల కు జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిర్రి బాలరాజుకు ప్రకటించారు. ఈ సీటు ఏ పార్టీకి, ఎవరికి కేటాయిస్తారని కొన్ని నెల లుగా సాగిన ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నియోజక వర్గ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాస్ పోటీ పడ్డారు. జనసేన నుంచి మరికొందరు పోటీకి రావడంతో బాలరాజు, శ్రీనివాస్ ఒక్కటయ్యారు. తమ ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని, మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వవద్దని ఇరు పార్టీల అధిష్టానాలను కోరారు. చివరికి జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పేరును ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కల్యా ణ్ ఆయనకు శనివారం బీఫాం ఇచ్చారు. ఆయన వెంట నాయకులు కరాటం రాంబాబు, సాయిబాబా, రవికుమార్ తది తరులు ఉన్నారు. వ్యవసాయ కుటుంబా నికి చెందిన బాలరాజుది జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2019లో జనసేన తరపున పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారు.