వైసీపీ ఐదేళ్ల పాలన నుంచి గన్నవరం నియోజకవర్గంలోని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విముక్తి కోరుకుంటున్నారు. నియో జకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. అందుకు వైసీపీని వీడి టీడీపీలో చేరికలే నిదర్శనం’’ అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ ఐదే ళ్లలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని, ఎక్కడ చూసినా అవినీతిమయమేనని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, ప్రతిపక్షాల నాయకుల ఆస్తుల ధ్వంసం, దాడులతో పాలన కొనసాగిందని ధ్వజమెత్తారు. మహనీయులు పాలించిన నియోజకవర్గం గన్నవరంలో అదే ఒరవడిని మీ అందరి ఆశీస్సులతో కొనసాగిస్తానని యార్లగడ్డ హామీ ఇచ్చారు. కానూరులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గన్నవరం మండలం బీబీగూడెం, గొల్లనపల్లి, చిక్కవరం, కొత్త గూడెం, సూరంపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, సర్పంచ్‌లు, పీఏసీ ఎస్ చైర్‌పర్సన్, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి యార్ల గడ్డ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి గన్నవరం సీటును చంద్రబాబు, భువనమ్మలకు గిప్ట్‌గా ఇద్దామ న్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తే భోజనం పెట్టానని అందేరే ప్రతిగా తనకు సున్నం రాశారని అన్నారు. టీడీపీ నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు, దొంతు చిన్న, బచ్చుల బోస్, బోడపాటి రవి, కొమ్మరాజు సుధీర్, పొట్లూరి బసవరావు, పడ మట రంగారావు, శొంఠి కిషోర్ పాల్గొన్నారు.