పదో తరగతి పరీక్షలో పక్కనున్న విద్యార్థి ప్రశ్నలకు జవాబులను చూపించలేదని పరీక్ష ముగిసిన తరువాత ఆ విద్యార్థిపై మరో విద్యార్థి నడిరోడ్డుపై కొందరు యువకులతో కలిసి దాడి చేశాడు. కడప జిల్లా, గుర్రంకొం డ జడ్పీ తెలుగు హైస్కూల్‌లో టెన్త పరీక్ష కేంద్రంలో హైస్కూల్ విద్యార్థులు, ఎల్లుట్ట, చెర్లోపల్లె, ఉర్దూ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు 260 మంది పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఫిజికల్ సైన్స పరీక్ష జరిగింది. అయితే పరీక్ష కేంద్రంలోని ఓ రూమ్‌లోని విద్యార్థి తనకు జవాబు పత్రం చూపించలేదని పరీక్ష ముగియగానే బయటకు వచ్చి తన బంధువులకు తెలుపడంతో వారందరూ కలిసి విద్యార్థిని అడ్డుకుని జవాబులను ఎందుకు చూపించలేదని చుట్టుముట్టి చితకబాదారు. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని మందలించడంతో వెళ్లిపోయారు. అంతటితో ఆగని ఆకతాయిలు బస్టాండులో మరోసారి విద్యార్థిపై దాడి చేశారు. పరీక్ష కేంద్రం బయట, బస్టాండులో విద్యార్థిని చితకబాదిన సంఘటనను చూసి తల్లిదండ్రులు, విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థిపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొట్టడం.. ఇంత జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.