పుంగనూరు పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గోవిందుడు శనివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేవదేవుడు 7 మాడవీధులలో భక్తులను కటాక్షిస్తూ ముందుకు సాగాడు. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.