మడకశిర మండలం నీలకంఠాపురంలో రొళ్ల పట్టడానికి చెందిన ఆశిప్ టిడిపిని వీడి మాజీమంత్రి రఘువీరారెడ్డి స్వగృహం నందు సిడబ్ల్యుసి మెంబర్ రొళ్ల కన్వీనర్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే గుడిబండ మండలం జమ్మల బండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తిప్పేరుద్రప్ప కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని కండువాలు వేసి మాజీమంత్రి రఘువీర పార్టీలోకి ఆహ్వానించారు.