వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. భార్య ఉన్నప్పటికీ భర్త మరో వ్యక్తితో, భర్త ఉన్నప్పటికీ భార్య మరొకతనితో సంబంధాలు పెట్టుకుంటుంటారు. అయితే వీరి మధ్య వివాహేతర సంబంధం గురించి తెలిసిన సదరు భర్త, భార్యలు కొందరు వారి మానాన వారిని వదిలేస్తే.. మరికొందరు మాత్రం తమకు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతారు. చివరకు ఎదుటి వారి ప్రాణాన్ని కూడా తీయడానికి వెనకాడారు. ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని లింగాలమండలం తాతిరెడ్డిపల్లెలో లక్ష్మినారాయణ అనే వ్యక్తిపై నారాయణ రెడ్డి అనే వ్యక్తి వేటకొడవలితో దాడి చేశాడు. దీంతో నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో నారాయణరెడ్డిని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.