కులాలను కించపరుస్తూ పోస్టులు పెట్టి యువత జీవితం నాశనం చేసుకోవద్దని నరసాపురం డీఎస్పీ జి.శ్రీనివాసరావు అన్నారు. ఆచంట పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆచంట మండ లం శేషమ్మచెరువుకు చెందిన పిల్లి సంతోష్ కుమార్ను అరెస్టు చేశా మన్నారు. ఇన్స్ట్రాగ్రామ్ తన అకౌంట్ నుంచి షెడ్యూలు కులంలో ఒక కులాన్ని కించపరుస్తూ వచ్చిన పోస్టును స్ర్కీన్ షాట్ తీసి వేరే గ్రూపులో షేర్ చేయడంతో వైరల్ అయ్యిందన్నారు.దీనిపై కోడేరు గ్రామానికి చెందిన సరిపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామన్నారు. ఎస్ఐ రాజశేఖర్, సీఐ కాళీ చరణ్ పాల్గొన్నారు