భగత్ సింగ్ స్ఫూర్తితో లౌకికవాదాన్ని కాపాడుకుందామని సిఐటియూ పట్టణ అధ్యక్షులు కసాపురం రమేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు మారుతీ ప్రసాద్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం గుంతకల్లు పట్టణంలోని సిఐటియూ కాలనీలో ఏర్పాటు చేసిన సదస్సులో వారు మాట్లాడారు. భగత్ సింగ్ స్ఫూర్తితో యువత విభజన హామీ హక్కులు, పరిశ్రమల కోసం, సిఎఏ, ఎన్ఆర్సిలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలన్నారు.