టీబీ నిరోధానికి తయారుచేసిన ‘ఎంటీబీవ్యాక్’ టీకా క్లినికల్ పరీక్షలను పెద్దలపై ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. మానవ మూల కణాల నుంచి అభివృద్ధి చేసిన తొలి టీబీ వ్యాక్సిన్ ఇదేనని తెలిపింది.
ప్రస్తుతం శిశువులకు వేస్తోన్న బాసిల్లస్ కాల్మెట్టే గురిన్ టీకా కంటే మెరుగ్గా పనిచేస్తుందని, పెద్దల్లో టీబీని నిరోధిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ప్రపంచంలో 28 శాతం టీబీ కేసులు భారత్లోనే నమోదవుతున్నాయి.