ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన.. ఫుల్ లిస్ట్ ఇదే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 07:50 PM

2024 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను కేటాయించారు. అయితే తొలివిడతలో ఐదుగురు పేర్లు ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మరో 11మందిని కలిపి మొత్తం18పేర్లతో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.


21 సీట్లలో 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. అలాగే కాకినాడ లోక్ సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఇటీవలే ఖరారు చేశారు. మచిలీపట్నం ఎంపీ సీటుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ నుంచి ఎంపీ బాలశౌరి మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆయనను అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.


జనసేన అభ్యర్థులు వీళ్లే..


పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌


తెనాలి - నాదెండ్ల మనోహర్‌


అనకాపల్లి - కొణతాల రామకృష్ణ


కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ


నెల్లిమర్ల - లోకం మాధవి


భీమవరం - పులపర్తి ఆంజనేయులు


తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌


నిడదవోలు - కందుల దుర్గేష్‌


రాజానగరం - బత్తుల బలరామకృష్ణ


పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు


యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌


పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ


రాజోలు - దేవ వరప్రసాద్‌


నరసాపురం - బొమ్మిడి నాయకర్‌


ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు


పోలవరం - చిర్రి బాలరాజు


తిరుపతి - అరణి శ్రీనివాసులు


రైల్వే కోడూరు - భాస్కరరావు


కాకినాడ (ఎంపీ) - తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com