టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు పదేపదే ఆయన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఉండవల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు ఒకే రోజు రెండు సార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. గత మూడు రోజుల్లో నాలుగు సార్లు కాన్వాయ్ ఆపి సోదాలు చేశారంటున్నారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని కాన్వాయ్‌లోని కార్లన్నింటినీ పరిశీలించారు. వాహనం దిగి లోకేష్ కూడా సహకరించారు.
పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు.. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొడానికి వెళ్తోన్న సమయంలో తనిఖీలు చేయగా.. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఆయన ప్రచారం సాగుతోందని నిర్ధారించారు.
గత మూడు రోజుల్లో నాలుగుసార్లు లోకేష్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మార్చి 20న ఉదయం 8గంటలకు, 23న ఉదయం 8గంటలకు, 24న ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం ఉదయం 8.10 గంటలకు, సాయంత్రం 5గంటలకు కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారని తెలిపారు.
లోకేష్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేష్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం టార్గెట్ చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. మార్చి 20వ తేదీ ఉదయం 8 గంటలకు, 23వ తేదీ ఉదయం 8 గంటలకు.. అలాగే ఈ రోజు (ఆదివారం) ఉదయం 8.10 నిమిషాలకు, సాయంత్రం 5 గంటలకు లోకేష్ కాన్వాయ్ ఆపి మరీ తనిఖీలు నిర్వహించారని మండిపడ్డారు.
లోకేష్ ప్రశ్నిస్తే.. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామంటూ పోలీసులు చెబుతున్నారని.. అయితే కేవలం లోకేష్ వాహనాలు మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా అన్నారు.అధికార వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుల కాన్వాయ్‌లు ఎందుకు తనిఖీలు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు. మంగళగిరిలో ఇప్పటి జగన్ రెడ్డి బొమ్మలున్న ఫ్లెక్సీలు.. ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నాయని.. వాటిని సైతం ఎందుకు తొలగించడం లేదంటూ పోలీసులను నిలదీశారు. తాడేపల్లి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం మానుకోవాలని మంగళగిరి పోలీసులకు అచెన్నాయుడు సూచించారు.