సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత అన్నారు. సోమవారం కల్లూరు అర్బన్ 20వ వార్డు శ్రీనగర్‌కాలనీలో శంఖారావం సూపర్‌సిక్స్ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని గౌరు చరిత కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ.... అధికార వైసీపీ పని అయిపో యిందని, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, మాండ్రసీమ ప్రసాద్‌రెడ్డి, పెరుగు ధుర్గాప్రసాద్రెడ్డి, వంగాల జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు అయ్యస్వామి, తదితరులు పాల్గొన్నారు.