వైసీపీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మండంలోని వెంకటగిరి, మర్రికుంట, పెండేకల్, రేపల్లె గ్రామాల్లో టీడీపీ మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి అధ్యక్షతన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ..... సైకో జగన్ రెడ్డి పాలన రాష్ట్ర రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం దాపురించిందన్నారు. రాష్ట్రం లో చిన్న, సన్నకారు రైతులు వలస కూలీలుగా మారి ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన వెంటనే రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకు వస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి, డోన్ నియోజకవర్గంలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి గత పాలకులు వేసిన రోడ్లపైనే రోడ్లు వేసి కమిషన్లు దండుకోవడం మంత్రి బుగ్గన నైజమని కోట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు. బేతంచెర్ల మండ లాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించి మిగిలిన మండలాలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపించడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు పెద్ద వెంకటేశ్వర్లు, రాజగోపాల్‌రెడ్డి, గొల్ల సుబ్బ య్య, ఈరన్న, తిరుమలేష్ రెడ్డి, ధోని రామాంజనేయులు, అయ్యస్వామి, సత్యం, సుబ్బారెడద్డి, ఎల్లస్వామి, నారాయణరెడ్డి, మోహన్ రెడ్డి, నగేష్, రామతిమ్మయ్య, మౌలాలి, బాలరంగడు, శివ నారాయణ, బజారు, పెద్దమాధవస్వామి పాల్గొన్నారు.