ఇంటికి కిలో బంగారమిచ్చినా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు ఓటమి తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం... జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.